రాంగ్ నంబర్

ఒకతను అతని భార్యని తన నమ్మకస్తుడైన పనివాడి ద్వారా చంపాలనుకున్నాడు. ఆఫీసుకు వెళ్ళిన తర్వాత ఇంటికి ఫోన్ చేశాడు. అక్కడ ఇంట్లో ఫోన్ లిఫ్టు అయింది.
"ర్రేయ్! నేన్రా మీ అయ్యగారిని మాట్లాడుతున్నాను.."
"ఆఁ! చెప్పండయ్యగారు.."
"ర్రేయ్.. చప్పుడు చేయకుండా మెల్లగా వెళ్లి నా డ్రాయింగ్ రూంలో ఉన్నరివాల్వర్ తీసుకొని మీ అమ్మగారిని చంపేయ్!"
"ఆలాగేనండి.." - రిసీవర్ పక్కన పెట్టిన సౌండ్ వచ్చింది.
కాసేపయ్యకా...
"అయ్యగారు.. మీరు చెప్పినట్టే అమ్మగారిని చంపేశానండి..ఇప్పుడు శవాన్ని ఏమి చేయమంటారండీ..?"
"ఆ శవాన్ని ఎదురుగా ఉన్న గోదాట్లో పడేయ్!"
"గోదారేంటండీ..?! సముద్రం కదా..?!!"
"సముద్రమేంట్రా? అది రాజమండ్రి కాదా?"
"కాదండి..విశాపట్నం"
"నువ్వు ఈరి గాడివి కాదా?"
"కాదండి సూరిగాడిని.."
"ఓహ్!? సారీ..రాంగ్ నంబర్"