దేవుడు

ఒక వృద్దదంపతులు ఇలా మట్లుడుకొంటున్నారు..
భార్య : అసలు ఆ దేవుడనేవాడు వుంటే మనకు ఇన్ని కష్టాలు వచ్చేవి కావు
భర్త: దేవుడున్నాడు..
భార్య: ఏంటి దేవుడున్నాడా..? నువ్వు చూసావా?
భర్త: చూడలేదు..కానీ రోజు నాకు సహాయం చేస్తాడా?
భార్య: ఏంటి రోజు సహాయం చేస్తాడా..? ఏం సహాయం చేస్తాడు?!
భర్త: నేను రోజు రాత్రి పూట బాత్రూం తలుపు తెరవగానే లైట్ వేస్తాడు..
భార్య: "...అంటే రోజు..ఫ్రిజ్ లో పాస్ పోస్తోంది నువ్వేనన్నమాట.."

డాక్టర్..డాక్టర్

అదేంటి డాక్టర్..మీ హాస్పిటల్ స్మశానం పక్కన కట్టారు??!!
అదేంలేదు..నేనిక్కడ హాస్పిటల్ పెట్టిన తర్వాతే ఆ స్మశానం ఏర్పడింది!!





ఏంటి డాక్టర్ ఒక పన్ను పీకితే వంద రూపాయలే కదా? మరి నాబిల్లులో మూడువందలు వేశారేంటి?"..అదా...నీ పన్ను పీకేటప్పుడు నువ్వు అరచిన అరుపులకి బయట వెయిట్ చేస్తున్న ఇద్దరు పేషంట్స్ పారిపోయారు..అందుకని.."




బాక్సింగ్ మ్యాచ్ హోరాహోరిగా జరుగుతోంది..ప్రేక్షకుల్లోంచి ఒకతను.."మ్మ్..కొట్టు..పళ్ళు రాలిపోవాలి అంతే..!!" అని ఒకటే అరుపులు....పక్కనున్నతను "..మీకు బాక్సింగ్ అంటే అంత ఇష్టమా?" అని అడిగాడు."..కాదు..ఈ పక్క సందులోనే నాకు డెంటల్ క్లినిక్ వుంది.." అని చెప్పాడా డాక్టర్.

బుజ్జిగాడు మినీ రివ్యూ



మోహన్ బాబు ప్రభాస్ కు రెండుసార్లు I LOVE YOU చెప్పే సీన్, త్రిష తనకు ఐలవ్యూ చెపితే త్రిషను ప్రభాస్ నరికేస్తాననడం..అందుకు త్రిష ఆన్న మోహన్ బాబు కళ్ళలో ఆనందబాష్పాలతో ఆనందించడం, ప్రభాస్ మోహన్ బాబును డాలింగ్ అని పిలవడం..త్రిష మాట్లాడే బూతులు.. ఈ సినిమాకే హైలైట్..ఇంతకుమించి నేను రివ్యూ రాయలేను.. క్షమించండి. ఆయినా మా ఫ్రెండ్ చెప్పనే చెప్పాడు.."టికెట్స్ ఈజీగా దొరికే సినిమాకు ఎప్పుడు వెళ్లొద్దురా" అని.. వాడి మాట పెడచెవిన పెట్టినందుకు నాకు తగిన శాస్తి జరిగింది.

భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు

"ఏరా అలా దిగులుగా వున్నావ్?"
"నా భవిష్యత్ తలుచుకొంటే భయంగా వుందిరా!!"
"అంత భయపెట్టే విషయమేంటిరా?"
"నా గతం!"

కొంటె ప్రశ్నలు - తుంటరి జవాబులు

అతితెలివికి పరాకాష్ట?
కరెంటుతో పని చేసే జనరేటర్ కనుక్కోవడం!!
బ్యాంకు మేనేజర్ ఆలోచనలో పడేదెప్పుడు?
"గుడి కట్టుకోవటానికి సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీమ్ కింద లోను ఇవ్వమని పూజారి అడిగినపుడు"
జడ్జి ఆలోచనలో పడేదేప్పడు?
"..రివాల్వర్ మీద వేలిముద్రలున్నాయి..కాబట్టి ముద్దాయి నిరాక్ష్యరాస్యుడని..లాయర్ వాదిస్తున్నపుడు.."
బుద్ది అంటే?

"మనకు వున్నట్టు...ఎదుటివారికి లేనట్టు అనిపించేది.."
జనానికి చిర్రెత్తుకొచ్చ్దేదెప్పుడు?
గుళ్ళో ఆంజనేయస్వామి కళ్యాణం చేయిస్తున్నామని చందాకు వచ్చినపుడు
జడ్జికి చిర్రెత్తుకొచ్చేదేప్పుడు?
"50 వేళరూపాయల జరిమానా కావాలా? లేక 5సంవత్సరాలు శిక్ష కావాలా?" అనడిగితే '..మొదటిదే ఇప్పించండి బాబయ్య..' అని దోషి అన్నప్పుడు.

[స్వాతిసపరివారపత్రిక లో 'ఈ శీర్షిక మీదే' లోనివి.]

కుక్క

"ఈరోజు రాత్రి ఒకసారి మా ఇంటికి రారా!!"
"ఏంట్రా ఎప్పుడూ లేంది నన్ను ఇంటికి పిలిస్తున్నావ్!?"
"ఏంలేదురా, మేము ఒక కొత్త కుక్కను కొన్నాం. అది దొంగలను కరుస్తుందో లేదో చూద్దామని..!!"