కారు

"లాయర్ గారూ మీరెలాగైనా నాకేసు వాదించి గెలిపించాలి..ప్లీజ్"

"ఫీజు ఏమాత్రం ఇవ్వగలరు..?"

"నేను పేదవాన్నండి..నా దగ్గర ఒక కారు తప్ప ఇంకేమీలేదండి..మీరు కొంచెం కనికరించాలి.."

"కారు పెట్టుకొని పేదవాన్నంటావేంటయ్యా..సరేకానీ ఫీజు కింద ఆ కారు ఇచ్చెయ్యి...ఇంతకీ కేసేంటి..?!"

"కారు దొంగతనం కేసండీ"

తెలుగు సామెతల fight

నిదానమె ప్రదానము X ఆలస్యం అమ్రుతం విషం

కష్టాలు మనుషులకు కాక మాన్లకు వస్తాయా? X పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు

మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె X ఆకలేసినా సింహం గడ్డి తినదు

చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి X గొటితో పొయెదానికి గొడ్డలి ఎందుకు?

చేసిన పాపం చెపితే పొతుంది X కడుపు చించుకొంటె కాళ్ళ మీద పడుతుంది

పసితనపు గడుసుదనం

"బుజ్జీ! తమ్ముడు ఎందుకు ఏడుస్తున్నాడొ చూడు.."
"ఏమొనమ్మా నేను నా లడ్డు తింటున్నా"
"వాడి లడ్దు యేమైంది..?!"
"ముందు అదే తిన్నాను..అప్పుడూ ఇలాగే ఏడ్చాడు.."
"................"